06-07-2025 01:02:20 AM
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో అమలు
రాజన్న సిరిసిల్ల, జూలై 5 (విజయక్రాంతి): నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎంఏ రెండో సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ రాసిన ‘లాంగ్ మార్చ్’ నవల ఎంపికైంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఈ నవలను పెద్దింటి రాశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఈ నవల ఉస్మానియాలోనూ సిలబస్‌గా ఉన్నది.
అలాగే నల్లగొండలోని నాగార్జున కళాశాల(అటానమస్) విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మానవ సంబంధాలపై అశోక్‌కుమార్ రాసిన మరో నవల ‘జిగిరి’ని పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నారు. ఈ నవల 12 భాషల్లోకి అనువాదమై వివిధ కళాశాలల్లో సిలబస్‌గా కొనసాగుతోంది. లాంగ్ మార్చ్, జిగిరి నవల లు త్వరలో సినిమాలుగా రాబోతున్నాయని పెద్దింటి చెప్పారు.
పెద్దింటి ఇప్పటికే సినీ నటుడిగా, పాటలు, మాటల రచయితగా గుర్తింపు పొం దారు. పెద్దింటి అశోక్‌కుమార్ రాజన్నసిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేట వాసి. ప్రస్తుతం సిరిసిల్లలోని రాజీవ్ నగర్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.