calender_icon.png 10 July, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మఠానికి పనికి వచ్చే వస్తువులను విరాళంగా ఇచ్చిన భక్తుడు

10-07-2025 04:27:04 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప మఠానికి పనికి వచ్చే వస్తువులను విరళంగా గురువారం భక్తులు అందజేశారు. బండాయప్ప మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సోమయ్యప్ప స్వామి ఆదేశాల మేరకు వినూత్నంగా ఆలోచించిన పెద్ద అడిగి గ్రామానికి చెందిన ప్రదీప్ పటేల్ అనే భక్తుడు అన్నదానానికి పనికి వచ్చే స్టీల్ బకెట్లను విరాళంగా ఇచ్చారు.

గురు పౌర్ణిమ సందర్భంగా మఠంలో ఏర్పాటు చేసిన గురుపూజ కార్యక్రమంలో విరాళంగా ఇచ్చి సోమయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పూలు శాలువాలు, దండలు తీసుకురావడం కంటే మఠానికి పనికి వచ్చే వస్తువులను విరాళంగా ఇవ్వాలని మఠాధిపతి సోమయ్య అప్ప పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.