calender_icon.png 11 July, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 14 ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి

10-07-2025 04:58:49 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): ఈనెల 14న తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించనున్న రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ బహిరంగ సభకు వేలాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో మండల స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా వెనకబడ్డ తుంగతుర్తి నియోజకవర్గాన్ని విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాణించుటకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించుటకు శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రులు నల్ల మాస ఉత్తమ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరుకానున్నట్లు తెలిపారు.

అనంతరం తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. కోదాడ హుజూర్నగర్ తరహాలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభ మాదిరిగానే, తిరుమలగిరిలో జరుగు బహిరంగ సభకు గడప, గడప నుండి వేలాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంగరి, గోవర్ధన్, తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, జై బాబు జై భీమ్ సమ్మిదాన్ కోఆర్డినేటర్ మాచర్ల అనిల్, మారగాని వెంకటయ్య, నల్లు రామచంద్రారెడ్డి, రామచంద్రయ్య, రేగటి రవి, కలకోట్ల మల్లేష్, దాసరి శ్రీను, దాయం ఝాన్సీ రెడ్డి, ఉప్పుల రాంబాబు, పెద్ద బోయిన అజయ్, కొండరాజు, నాగరాజు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.