10-07-2025 01:08:23 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అద్భుతమైన అవకా శం కలెక్టర్ల చేతుల్లోనే ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మైనింగ్ చేయడం ద్వారా వచ్చే ప్రతి పైసాకు లెక్క ఉంటుందని తెలిపారు.
బుధవారం ఢిల్లీలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్‌పై జరిగిన వర్క్‌షాప్‌లో కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గతంలో ఇల్లీగల్ మైనింగ్ పెద్దఎత్తున జరిగేదని, ప్రధాని మోదీ తీసుకున్న చర్యల కారణంగా మైనింగ్ అంతా పారదర్శకంగా మారిం దన్నారు. దీనివల్ల రాష్ర్ట ప్రభుత్వాలకు ఆదా యం పెరుగుతోందని తెలిపారు. గనుల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) ఏర్పాటు చేశామని,
ఈ సంస్థ ద్వారా వచ్చే నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ఉపయోగించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. డీఎంఎఫ్‌కు జిల్లా కలె క్టర్లు చైర్‌పర్సన్లుగా వ్యవహరించనున్నట్టు పే ర్కొన్నారు. మూడురోజుల క్రితం వరకు తెలంగాణలో మాత్రం మంత్రులే డీఎంఎఫ్ చైర్మన్లు గా ఉండేవారన్నారు. డీఎంఎఫ్‌లో ఎమ్మె ల్యేలు, ఎంపీలు భాగస్వామ్యులుగా ఉంటారని, అయితే మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదేనని స్పష్టంచేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 646 డీఎంఎఫ్‌లు ఉన్నాయని.. వీటి ద్వారా లక్ష కోట్లను జమ చేసినట్టు తెలిపారు. ఇందులో దాదాపు రూ.90 వేల కోట్లు పలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశామన్నారు. యాస్పిరేషనల్ జిల్లాల కోసం ప్రత్యేకం గా యాస్పిరేషనల్ డీఎంఎఫ్ ప్రోగ్రాంను ప్రా రంభించామని చెప్పారు. ఇందులో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
డీఎంఎఫ్, సీఎస్‌ఆర్, ప్రభుత్వ పథకాల ను, మైన్ క్లోజర్‌కు సంబంధించిన కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ అ ప్రోచ్ తీసుకురావాలన్నారు. డీఎంఎఫ్ ఎగ్జిబిషన్స్‌లో స్వయం సేవా సంఘాలు, మహిళలు, యువతను భాగస్వామ్యం చేయాలని కోరారు. గనుల కోసం పేదలు, రైతుల భూములు తీసుకోవాల్సి వస్తుందని, సంక్షేమ కార్యక్రమాల్లో వారికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు.