05-08-2025 01:07:46 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 4 (విజయక్రాంతి) ఈ సీజన్లో పండించిన పంటలకు అవసరమయ్యే యూరియా పంపినీలో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణదారులు యూరి యా కృత్రిమ కొరతను సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా వ్య వసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు హె చ్చరించారు. సోమవారం జిల్లాలోని ఆయా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 3,489 మెట్రిక్ టన్నుల యూ రియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఈ తనిఖీల్లో నాగర్ కర్నూల్ వ్యవసాయ అధికారి రాజుపాల్గొన్నారు.