05-08-2025 01:09:30 AM
-భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్
-మాల్‌లో ప్రభుత్వ భూమి కబ్జా అయిందంటూ ప్రజావాణిలో ఫిర్యాదు
యాచారం ఆగస్టు 4 : ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలని భూముల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
యాచారం మండలంలోని మాల్ గ్రామపంచాయతీ నల్లవెల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 567,531 లో ప్రభుత్వ భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేసినారని,ఆ యొక్క భూమిలో అక్రమంగా ఇంటి నెంబర్లని సృష్టించుకుని డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని లావాదేవీలు జరుపుతున్నారని అన్నారు.
అట్టి విషయమై గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామ మాత్రం గానే చూసి చూడనట్లు వదిలి వేశారని అన్నారు. కబ్జా చేసిన వారిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదని, పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ స్పందన లేదని,ఇప్పటికైనా కబ్జా కు గురైన ప్రభుత్వ భూమిని పరిరక్షించి సర్వే చేసి హద్దులు నియమించి పి ఓ టి చట్టం కింద భూమిని స్వాధీనపరచుకొని కబ్జా చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.