calender_icon.png 12 May, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు

11-12-2024 01:20:08 AM

  • మిల్లర్లు అలసత్వం వహిస్తే ఉపేక్షించం
  • అదనపు కలెక్టర్ సీతారామారావు

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): 2021 2022 ఏడాదిలో యాసంగి సీజన్లవారీగా తీసుకున్న ధాన్యా న్ని సీఎంఆర్ చేసి జనవరి 16లోగా 25 శాతం ఫెనాల్టీతో ఇవ్వకపోతే మిల్లర్లపై క్రిమినల్ కేసులు తప్పవని అదనపు కలెక్టర్ సీతా రామారావు హెచ్చరించారు.

జిల్లాలోని రైస్‌మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా యాసంగి ధాన్యాన్ని సీఎంఆర్‌కు ఇవ్వకుండా మిల్లర్లు అలసత్వం వహి స్తున్నారని.. ఇకపై ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

2022 యాసంగికి సంబంధిం చిన సీఎంఆర్ ఈ నెలాఖరులోగా చెల్లించాలని, 2023 సంబంధిం చిన బియ్యాన్ని ఈనెల 15లోగా చెల్లించాలని.. లేదంటే 6ఏ చట్టప్రకారం మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్‌వో శ్రీనివా సులు, మేనేజర్ రాజేందర్ ఉన్నారు.