29 March, 2026 | 4:52 AM

సగం వెలుగు.. సగం చీకటి

16-05-2024 02:22 AM

కొత్తగూడెంలో అస్తవ్యస్తంగా సెంట్రల్ లైటింగ్ నిర్వహణ

పట్టించుకోని అధికార యంత్రాంగం

భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో సెంట్రల్ లైటింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రహదారిపై కొన్ని చోట్ల వీధి దీపా లు చమక్ మంటూ మెరుస్తుండగా, మరికొన్ని చోట్ల కారుచీకటి కమ్ముకుంటోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. జగదల్‌పూర్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిలో జిల్లా కార్యా లయం నుంచి లక్ష్మీదేవిపల్లి మొర్రెడు వాగు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పర్యవేక్షణ లేకపోవడంతో నెలల తరబడి ఇదే సమస్య ఉంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతి నిధులు సెంట్రల్ లైటింగ్ నిర్వహణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.