calender_icon.png 25 August, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి పరిమితిని బట్టి పంటలు సాగు చేసుకోవాలి

13-03-2025 11:55:48 PM

మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ

మునుగోడు,(విజయక్రాంతి): వేసవి దృష్ట్యా నీటి పరిమితిని బట్టి పంటలను సాగు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఎస్ పద్మజ అన్నారు. మండల పరిధిలోని పులిపలుపుల  గ్రామంలో  ఎండిపోతున్న వరి పంట పొలాలను ఆమె క్షేత్ర స్థాయి సందర్శన చేశారు. రైతులతో మాట్లాడుతూ ఎండిపోయిన బోర్ల ను ఇంకుడు గుంతల సాయంతో  రీచార్జ్ చేసుకోవాలి అని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం చేయడం వలన భూమికి నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది అని, విచ్చల విడిగా ఎరువులు , పురుగుల మందులు వాడినచో భూమిలో చౌడు పెరుగుతుందని చెప్పారు. రైతులు వరి పంట కు ప్రత్యామ్నాయంగా ఆరుతడి  పంటలైన పప్పు ధాన్యాలు,  మొక్కజొన్న ,కూరగాయలు సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు బిందు సేద్యం లో ఆయిల్  పాము తోటల పెంపకం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఏఈఓ నర్సింహ్మ, రైతులు ఉన్నారు.