calender_icon.png 26 August, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు పండ్ల పంపిణీ

14-03-2025 12:00:00 AM

మేడ్చల్, మార్చి 13 (విజయక్రాం తి): ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఘట్కేసర్ వైఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి గురువారం రోగులకు పండ్లు పంపిణీ చేశా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయస్సుతో నిమిత్తం లేకుం డా అందరికీ కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు ఇష్టానుసారంగా మందుల వాడడం వల్ల మూత్రపిండాలు చెడిపోతున్నాయన్నారు. అందరూ క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఘట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.