12-04-2025 12:00:00 AM
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): రైతులు పండించిన జొన్న పంటను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్ మం డలంలోని ధన్నూర్ (బి) గ్రామంలో శుక్రవా రం తల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా కాంటాకు ప్రత్యేక పూజ లు చేసి, పంటను తీసుకువచ్చిన తొలి రైతు ను శాలువాతో సత్కరించి కొనుగోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తు లు ఎమ్మెల్యేని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే అనిల్ జాద వ్ మాట్లాడుతూ.. ఇటీవల తనను కలిసిన గ్రామస్థుల విన్నపం మేరకు జిల్లా కలెక్టర్ కి లేఖ రాసి ఫోన్‌లో సంప్రదించి జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని పేర్కొ న్నారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.