calender_icon.png 11 May, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

10-05-2025 10:30:20 PM

క్రమశిక్షణ ఉంటేనే వృత్తిలో విజయం 

శిక్షణ తరగతుల్లో ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు 

మంచిర్యాల,(విజయక్రాంతి): దేశంలోని న్యాయవ్యవస్థలో రోజూ అనేక కొత్త చట్టాలు వస్తున్నాయని, వాటి పట్ల న్యాయవాదులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు అన్నారు. శని వారం మంచిర్యాలలోనీ సుచిత్ర ఇన్ హోటల్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాలు తెలిసి ఉంటేనే వృత్తిలో విజయం సాధించవచ్చని, అంతే కాకుండా న్యాయవాదులకు క్రమ శిక్షణ కూడా చాలా ముఖ్యం అని అన్నారు. చట్టాలపై అవగాహన లేకుండా వృత్తిలో విజయం సాధించలేరన్నారు. బెంచ్ అండ్ బార్ రిలేషన్ నేర్చుకోవాలన్నారు. సామాజిక బాధ్యతతో న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, బార్ కౌన్సిల్ సభ్యులు కొల్లి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజి, జాడి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి శైలజ, వేణుగోపాల్ రావు, రమేష్ మక్కడ్, ఎం. శ్రీనివాస్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, కార్యదర్శి మురళి, సీనియర్ న్యాయవాదులు రాజన్న, చిట్ల రమేష్, రాజేష్ గౌడ్, రవీందర్ రావు, రవీందర్, భుజంగరావు, గంగయ్య, వివిధ జిల్లాల నుండి 400 మంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.