10-05-2025 10:26:51 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి శనివారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బీర్కూరు, నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రెండు పోలీస్ స్టేషన్లను డిఎస్పి విట్టల్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలన్నారు రాత్రి వేళలో చోరీలను నియంత్రణకు గస్తినిలను ముమ్మరం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీర్ కు ఎస్ఐ రాజశేఖర్ నస్రుల్లాబాద్ శిక్షణ ఎస్ఐ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.