10-05-2025 10:39:55 PM
15 రోజుల కుట్టు శిక్షణ
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్, గ్రామ స్వరాజ్య సంస్థ కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారికీ కుట్టు మిషన్లను 60% సబ్సిడీతో శనివారం లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. మహిళలకు 15 రోజులు శిక్షణ ఇచ్చి అర్హులైన వారికి అందియడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల ఎంపీడీఓ ప్రకాష్, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా కలిసి వారికీ కుట్టు మిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.