calender_icon.png 11 May, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్షల్లో ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

10-05-2025 10:14:31 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): డిగ్రీ చదువు పూర్తయిన కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బుక్యా రామ్ తండా శివారు అవుసలి తండాలో జరిగింది. కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ కథనం ప్రకారం జాటోత్ మోహన్ (22) డిగ్రీ చదువు పూర్తయినప్పటికీ కొన్ని సబ్జెక్టులు బ్యాక్ లాగ్ కావడంతో మనస్థాపానికి గురై ఈనెల 6న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించాడు. తండ్రి బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.