calender_icon.png 17 November, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం

17-11-2025 12:34:37 AM

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్, నవంబరు 16 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు సొంతింటి కలలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఆదివారం తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో పెరుక శివాని అనే లబ్ధిదారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నోచుకోలేదన్నారు. పేదలకు ఇళ్లు మంజూరు చేయాలన్న ధ్యా సే ఆ ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయడం, ఆ ఇళ్ల గృహప్రవేశాలు పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు శ్రీగిరి రంగారావు, గోపు మల్లారెడ్డి, బుధారపు శ్రీనివాస్, మామిడి అనిల్ కుమార్, పోలు రాము, రమేష్, కొత్త రాజిరెడ్డి, అబ్దుల్ రజాక్, చిరుతల యాదగిరి, గుంటి మల్లేశం, పెంట వినోద్, తదితరులుపాల్గొన్నారు.