31 March, 2026 | 2:13 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

01-12-2025 12:03 AM

 కొమురవెల్లి, నవంబర్ 30 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచే భక్తుల కోలహాలం మొదలైంది. స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి గంట పైగా సమయం పట్టింది. భక్తులు ముందుగా స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గర్భాలయంలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.

తర్వాత మొక్కుబడులలో భాగంగా స్వామివారికి పట్నాలు, బోనాలు చెల్లించి, మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా కొండపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.విరాళంగా స్వామివారికి వెండి గిన్నెలుకొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి స్థానిక భక్తుడు ఉప్పల అశోక్ రాజు వెండి గిన్నెలు విరాళంగా అందజేశారు. సుమారు 490 గ్రాములు ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.