విగ్రహావిష్కరణకు భారీగా తరలిరండి
09-12-2024 01:40 AM
* పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో జరుగనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలిరావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్ నుంచి ఆదివారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ప్రజాపాలన విజయోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలిరావడమే అందుకు నిదర్శనమన్నారు.






