నేడు తెలంగాణ బంద్?
09-12-2024 01:39 AM
పిలుపునిచ్చిన మావోయిస్టులు
మహబూబాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.ఈ మేరకు ఆదివారం తెలం గాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖను విడుదల చేశారు. నవంబర్ 30న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప అడవుల్లోని పోకలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపా రు.ఈఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపు నిచ్చినట్టు లేఖలో పేర్కొన్నారు.






