05-09-2025 12:30:48 AM
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజాపూర్, సెప్టెంబర్ 4: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తానని...అభివృద్ధికి పట్టం కట్టండని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అగ్రహారం పొట్లపల్లి గ్రామంలో రూ. 33 లక్షల నిధులతో నిర్మించిన అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లను ప్రారంభించారు.
అలాగే కల్లేపల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రూ. 18 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేరకు రంగారెడ్డిగూడెం నుండి ఈద్గాన్ పల్లి మీదుగా డబల్ రోడ్డు నిర్మిస్తానని చెప్పి రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో అర్హులకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు అందించినట్లు తెలిపారు.
ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. అలాగే గ్రామంలో కోతుల సమస్య పూర్తిగా నిర్మూలన చేసినట్లు తెలిపారు.
ఈ స్థానిక ఎన్నికల తర్వాత జడ్చర్ల నియోజకవర్గం లో అవినీతికి పాల్పడిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులను నియోజకవర్గ నుండి వెలివేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి,ఎంపీఓ వెంకట్ రాములు, మాజీ సర్పంచ్ బాలమణి, శ్రీశైలం, భరత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.