12-01-2026 12:17:47 AM
భద్రాచలం, జనవరి 11, (విజయక్రాంతి): గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ఈనెల జనవరి 27వ తేదీన భద్రాచలంలో జరగనున్న టిన్ని లుప్స్ సౌత్ ఇండియా సిఎస్‌ఆర్ సమ్మేట్ కి అనువైన ప్రాంతాన్ని పరిశీలించడానికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం సిఎస్‌ఆర్ సమ్మెట్ నిర్వహణకు ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన భవనం, సారపాక లోని కళాభారతి భవనాలను ఆయన పరిశీలించి ,గిరిజన భవనంలోనే సి ఎస్ ఆర్ సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఐటీసీ అధికారులకు ఆదేశించారు.
ఈ సమ్మిట్లో 15 పేరున్న కార్పొరేట్ సంస్థలు పాలు పంచుకుంటున్నందున కేవలం స్వల్పకాలిక ప్రయోజనాలే కాకుండా, సమాజం కోసం దీర్ఘకాలికమైన ,స్థిరమైన ప్రభావాన్ని తీసుకురావడానికి మనమందరం కలిసి పని చేయాలన్నారు. ఇందుకోసం కార్పొరేట్స్, సి ఎస్ ఆర్ నాయకులు, పాలసీ మేకర్స్, డెవలప్మెంట్ పార్ట్నర్స్ అందరూ విచ్చేసి, తమ ఆలోచనలను పంచుకోవాలని కోరుతూ, తద్వారా మన జిల్లాలోని కమ్యూనిటీలలో అర్థవంతమైన మార్పును తీసుకురావలన్నారు.జిల్లాలోని గిరిజన సంస్కృతిని , గ్రామీణ వాతావరణాన్ని కూడా సిఎస్‌ఆర్ సమ్మేట్ ప్రతినిధులు ఇక్కడ ఆస్వాదించవచ్చునని, మన సమాజంలో నిజమైన మార్పు కోసం ఈ సి ఎస్ ఆర్ సమ్మిట్లో మనమందరం కలుద్దామన్నారు.
సిఎస్‌ఆర్ సమ్మిట్ కార్యక్రమానికి వచ్చే ప్రతినిధులకు గిరిజన భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లాలోని దర్శనీయ స్థలాలు బెండలపాడు, కిన్నెరసాని, మొరంపల్లి బంజారా చేపల యూనిట్, జూలూరుపాడు, గిరిజన మ్యూజియంతో పాటు బోజ్జి గుప్పలోని పాతకాలపు ఇండ్లు గిరిజన వంటకాలు చవి చూసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ డీజీఎం చంగల్ రావు, టిఎ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, పోశాలు, అఖిల్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.