calender_icon.png 15 October, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయనిక ఎరువుల వినియోగం లేకుండా సాగు చేయాలి

15-10-2025 12:41:59 AM

సిద్దిపేట రూరల్, అక్టోబర్ 14: మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వంగడాలను, కొత్త పద్ధతులను వరి, పత్తి  ఇతరత్ర పంటలను ఆయా పద్ధతులను అలవర్చుకుని రసాయనాలు వాడకుండా పంటల సాగు చేసే విధంగా విద్యార్థులు పరిశోధనలు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు.

సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో ప్రొఫెషన్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్నీ జిల్లా కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించి మాట్లాడారు.  ఈ కలుషితం అయిన నేల నుండి ఆహారాన్ని, నీటిని తాగుతు, గాలినీ పిలుస్తున్నామని చెప్పారు.

గతంలో లేని రోగాలు, ఆరోగ్య సమస్యలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. అందుకే మేలి రకమైన పద్ధతుల ద్వారా ఆర్గానిక్ లో వ్యవసాయ పద్ధతులను అలవర్చుకుని అందరం ఆరోగ్యంగా ఆహారాన్ని పొందాలి అంటే మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలని, ఇది ఒక్క రోజు తో అయ్యేది కాదనీ, మెల్లమెల్లగా మంచి ఆహారాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని తెలిపారు.

ఆహారం అందరికీ అవసరం, వ్యవసాయ యూనివర్సిటీ యొక్క పరిశోధనలు ప్రజలకు ఉపయోగించడానికి కృషి చేస్తున్న విద్యార్థులను కలెక్టర్ హైమావతి అభినందించారు. విశాలమైన దృక్పథంతో అనేక ప్రయోజనాల కోసం రైతులు పంటలు పండిస్తున్నారనీ చెప్పారు. దేశంలో 150 కోట్ల జనాభా ఉన్నాకూడా ఆహారాన్ని రైతులు అందిస్తున్నట్లు తెలిపారు. 

కరోనా సమయంలో కూడా ఆహారం గురించి ఎక్కడ ఇబ్బంది కలగ కుండా సగర్వంగా నిలబడగలిగింది అంటే ఆది ఒక్క రైతులకు మాత్రమే సాధ్యం అయిందన్నారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి సంతోష్ కుమార్, ఏడిఏ పద్మ, అసోసియేషన్ డీన్ ఏ జి కాలేజీ సిరిసిల్ల సునీత దేవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.