calender_icon.png 18 November, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జిల్లాలో డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి

18-11-2025 12:53:11 PM

జిల్లా అధికారులు, సిబ్బంది చే మాదకద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ లో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాశాము మొత్తం భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ డి వేణు, డీసీపీ కరుణాకర్ లతో కలిసి జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చే మాదకద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మాదకద్రవ్యాలు నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా మన వంతు కృషి చేయాలని, యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని, సరదా కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని కలెక్టర్ సూచించారు.  డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.