calender_icon.png 26 July, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర క్యాబినెట్ భేటీ వాయిదా

26-07-2025 01:14:57 AM

28న మధ్యాహ్నం 2గంటలకు

హైదరాబాద్, జులై 25 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడిం ది. ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు  క్యాబినెట్ సమావేశం జరగను న్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,  పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకి టి శ్రీహరి తదితరులు ఢిల్లీలో ఉండ టం వల్ల శుక్రవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశం సోమవారానికి వా యిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.