calender_icon.png 28 October, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్

28-10-2025 02:08:29 PM

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో(Southeast Bay of Bengal) ఏర్పడిన తీవ్ర వాయుగుండం మొంథా తుఫానుగా(Cyclone Montha) మారడంతో భారత వాతావరణ శాఖ (India Meteorological Department)  ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నాడు ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాన్ మంగళవారం కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సోమవారం రోజు ఎల్లో అలర్ట్ జారీ చేయబడినప్పటికీ, రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు పొడి వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లాలోని ముధోల్‌లో అత్యధికంగా 3.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. అక్టోబరు 28న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 29న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు పడనున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యవసర చర్యలను సమన్వయం చేయడానికి పౌర సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. మొంథా తుపాన్ సముద్రంలో అల్లకల్లోలంగా మారి తీరప్రాంతానికి సమీపంలో ఉన్న ఆస్తులకు నష్టం కలిగిస్తుంది. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక యంత్రాంగం హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం తేదా రాత్రి సమయంలో కాకినాడ చుట్టూ మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని, గరిష్టంగా గంటకు 90-100 కి.మీ వేగంతో 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.