28-10-2025 02:09:35 PM
- హాస్టల్లో విద్యార్ధి ఆత్మహత్యయత్నం.!
- ఆసుపత్రికి తరలింపు. పరిస్థితి విషమం
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను మన్నించండి అంటూ సూసైడ్ నోట్ రాసి హాస్టల్లో ఉంటూ చదువుతున్న డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ గర్ల్స్ హాస్టల్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కొల్లాపూర్ నియోజక వర్గం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన స్ఫూర్తి( 21) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
మంగళవారం హాస్టల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తోటి స్నేహితులు, సిబ్బంది 108 సహాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలఫై అధికారులు ఆరా తీస్తున్నారు. సుమారు మూడు పేజీల సూసైడ్ లెటర్ హాస్టల్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.