calender_icon.png 28 October, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన తప్పనిసరి

28-10-2025 03:08:23 PM

మండల వ్యవసాధికారి సాయికిరణ్

దౌల్తాబాద్‌: పత్తి పంట అమ్ముకునే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్  అందుబాటులోకి తీసుకొచ్చింది మండల వ్యవసాయాధికారి సాయికిరణ్ పేర్కొన్నారు. దౌల్తాబాద్ రైతువేదికలో కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని రైతులు పత్తి విక్రయానికి ముందు ఈ యాప్ లో  స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు తమ జిల్లాలో ఏ మిల్లులో అయిన పత్తి అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ అనంతరం సదరు మిల్లులో విక్రయాలకు అనుగుణంగా తేది, సమయాన్ని యాప్ ద్వారా రైతుకు తెలియజేస్తామన్నారు. రైతులు విక్రయాల కోసం పడిగాపులు…