28-10-2025 02:00:33 PM
వలిగొండ,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వలిగొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద నుండి లోతుకుంట వరకు స్థానిక ఎస్ఐ యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అంకితభావంతో విధి నిర్వహణ కొనసాగిస్తారని అన్నారు. సమాజంలోని చెడును నివారించేందుకు పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారని అన్నారు. అనంతరం పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు.