calender_icon.png 3 November, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రో కబడ్డీ విజేత దబాంగ్ ఢిల్లీ

01-11-2025 12:00:00 AM

-ఫైనల్లో పుణేరి పల్టన్‌పై విజయం

-రెండోసారి టైటిల్ కైవసం

న్యూఢిల్లీ, అక్టోబర్ 31 : రెండు నెలలుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీ 31 స్కోరుతో పుణేరి పల్టన్‌పై విజ యం సాధించింది. దబాంగ్ ఢిల్లీ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. లీగ్ స్టేజ్‌లో టాప్ రెం డు స్థానాల్లో నిలిచిన జట్లు పోటీపడడంతో ఊహించినట్టుగానే మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

ఫస్టాఫ్‌లో తమకు వచ్చిన మూడు పాయింట్ల ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్లిన ఢిల్లీ ఆ తేడాను 6 పాయింట్లకు మెరుగపరుచుకుంది. అయితే సెకండా ఫ్‌లో పుణేరి పల్టన్ కూడా పోరాడిం ది. చివర్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఢిల్లీ పాయింట్ల తేడాను తగ్గకుండా చూసుకుని టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో బెస్ట్ రైడర్‌గా అయాన్, బెస్ట్ డిఫెండర్‌గా నవీదీప్, బెస్ట్ న్యూ యంగ్ ప్లేయర్‌గా దీపక్ శకంకర్, ఇరాన్‌కు చెందిన ఫజల్ అత్రచాలి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచారు.