01-11-2025 12:00:00 AM
హైదరాబాద్, అక్టోబర్ 31: గోల్ఫ్ ఇండ స్ట్రీ అసోసియేషన్(జీఐఏ) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ 2025 ముగిసింది. బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ క్లబ్ వేదికగా 2 రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో టర్ఫ్ మేనేజ్‌మెంట్, రియల్ ఎస్టేట్, గోల్ఫ్ ప్లేయర్స్‌తో పాటు గోల్ఫ్ అసోసియేషన్, పీజీటీఐకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా గోల్ఫ్‌ను మరింత ప్రమోట్ చేయడం, గోల్ఫ్ కోర్సుల నిర్మాణంలో సాంకేతికతను పెంచడం, మౌలి క సదుపాయాలు పెంచడం వంటి అంశాల పై చర్చించారు. గోల్ఫ్ క్రీడతో టారిజంను అభివృద్ధి చేయడంపైనా కీలక సూచనలు చేశారు. గోల్ఫ్ కోర్సుల నిర్మాణంలో ఉపయోగించే ఎక్విప్‌మెంట్స్‌కు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఫ్రెండ్లీ గోల్ఫ్ టోర్నమెంట్ నిర్వహించారు.