calender_icon.png 4 November, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువు పంపిణీ కార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

03-11-2025 05:14:04 PM

చైర్మన్ రామచంద్రయ్య..

మఠంపల్లి: మఠంపల్లి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం నందు సోమవారం కార్యవర్గ సమావేశం అధ్యక్షులు జవ్వాజి రామచంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మఠంపల్లి మండలంలోని రైతులందరికీ సంఘము ద్వారా ఎరువులు యూరియా పంపిణీ చేయుటకు సంఘం నందు ఎరువుల పంపిణీ కార్డులను అందజేయుట కొరకు  కార్యవర్గం తీర్మానించడం జరిగిందని, ఈ ఎరువుల పంపిణీ కార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, మండలంలోని పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులు సంఘం నందు ఎరువుల పంపిణీ కార్డులను సోమవారం నుంచి అధికారులు రైతులకు అందజేస్తున్నారని తెలిపారు.

కార్డు కోసం కావలసిన పత్రాలు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ (1B ),ఆధార్ కార్డు జిరాక్స్, ఫోటో తీసుకొనిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బానోతు బాబు నాయక్, సంఘ డైరెక్టర్లు  పస్యరామ్ నరసమ్మ, భూక్యా లాస్య, పట్టేటి అంతోని, కుర్రె రామనరసయ్య,సిఇఓ బత్తుల తిరుపతయ్య  సిబ్బంది రైతులు పాల్గొన్నారు.