calender_icon.png 4 November, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

03-11-2025 05:36:05 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్..

ప్రజావాణికి 149 దరఖాస్తులు..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీపృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 149 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఆయా శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కారమయ్యాయి? తదితర వివరాలపై ఆరా తీశారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు. రెవెన్యూకు 58, డీఆర్డీఓ కు 20, హౌసింగ్ కు 14, ఎస్డీసీకి 11, డీపీఓకు 7, డీఈఓ 6, డీఎంహెచ్ఓ, సెస్ కు ఐదు చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, ఉపాధి కల్పన అధికారికి మూడు చొప్పున, డీసీఎస్ఓ, ఎక్సైజ్ ఆఫీసుకు రెండు చొప్పున, డీసీఓ, ఫారెస్ట్ అధికారి, రిజిస్ట్రార్, డీఎస్సీడీఓ, డీవీహెచ్ఓ, డీ ఎం ఆర్టీసీ సిరిసిల్ల, జిల్లా సంక్షేమ అధికారి, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎల్ డీ ఎం కు ఒకటి చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.