calender_icon.png 4 November, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా భీమన్న జాతర

03-11-2025 05:31:24 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో శ్రీ గుండ్ల గుట్ట భీమన్న దేవుని జాతర సోమవారం ఘనంగా నిర్వహించారు. గత నాలుగు రోజులుగా కొనసాగిన జాతర ఆదివారం సాయంత్రం భీమన్న దేవుని గజాలను గోదావరి జలాలతో శుద్ధిచేసి సోమవారం ఉదయం బండారి బసంతంతో జాతర ముగించారు. ఈ జాతరకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.