03-11-2025 05:29:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్థానిక బిజెపి నాయకులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మోసాలను వివరించి బిజెపి గెలిస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.