27-11-2025 07:14:46 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు గురువారం శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు, నిత్య హోమములు జరిగాయి. నిత్య కళ్యాణం దేవాలయ అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయ చార్యులు వార్లచే శాస్త్రోతముగా నిర్వహించబడినది. కల్యాణంలో పాల్గొన్న దంపతులు కీతా ప్రశాంత్ లక్ష్మీ ప్రణీత, బాలు శ్రీనివాస్ అరుణ దంపతులు పాల్గొన్నారు.
దేవస్థానం నందు కొబ్బరికాయలు అమ్ముకొనే హక్కు టెండర్-కం-బహిరంగ వేలం నిర్వహించగా వేలంలో ఒక్కరు మాత్రమే డిపాజిట్ చెల్లించినందున వేలము వాయిదా వేయడమైనది. త్వరలో వేలం నిర్వహించబడును. కార్యక్రమంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు విజయకుమార్, పర్యవేక్షణ అధికారి వెంకట చలపతి, శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, కార్యనిర్మాణాధికారి బి.జ్యోతి వారలు పాల్గొన్నారు. దేవాలయం అన్నదానంలో 113 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది.