calender_icon.png 27 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి

27-11-2025 07:06:56 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలలో బంగారు పతకం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీలలో, రాష్ట్రస్థాయి పోటీలలో బంగారు పతకం, బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర జట్టుకు ఎంపికైన 4 మంది విద్యార్థినులు రజత పతకం సాధించిన జిల్లా జట్టు కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులు గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించి జిల్లా పేరును నిలబెట్టాలని తెలిపారు. క్రీడలలో అత్యున్నత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులకు తర్ఫీదు అందించిన కోచ్ లు, వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి మడావి శేషు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పుర్క ఉద్ధవ్, కోచ్ లు తిరుమల, విద్యాసాగర్, అరవింద్, పి. డి.లు మీనా రెడ్డి, గుండం లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.