calender_icon.png 7 July, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ముందుకు ఖమేనీ

07-07-2025 01:27:45 AM

- యుద్ధం తర్వాత తొలిసారి బయట కన్పించిన ఇరాన్ సుప్రీం లీడర్

-అషురా కార్యక్రమానికి హాజరు

టెహ్రాన్, జూలై 6: ఇజ్రాయెల్‌తో యు ద్ధం ముగిసిన అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి ఓ కార్యక్రమానికి హాజరై.. ప్రజలకు కనిపించారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన అషురా కార్యక్రమానికి ఖమేనీ హాజరై ప్రసంగించారు.

ఆయన ప్రవేశించగానే.. మసీదులో ఉన్న వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి.. ఆయనకు మద్దతుగా అందరూ నినాదాలు చేశారు. ఇజ్రా యెల్‌తో యుద్ధం సమయంలో ఆయన చాలా  రోజుల పాటు రహస్య స్థావరంలో తలదాచుకున్నారు. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఆయనకు ఇరాన్‌లోని అత్యంత రహస్య, ఉన్నత విభాగం భద్రత కల్పించింది.

ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా ఇరాన్‌కు చెందిన కీల క కమాండర్లు మృతిచెందినా కానీ ఖమేనీ హాజరుకాకపోవడం గమనార్హం. చివరగా ఖమేనీ జూన్ 11న సైనిక కమాండర్ల సమావేశంలో కనిపించారు. యుద్ధం సమయం లో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి వీడియో వి డుదల చేసినా బహిరంగప్రదేశాల్లో కన్పించలేదు.  అషురా కార్యక్రమం షియా ముస్లి ములకు అత్యంత పవిత్రమైనది. ఆయన కా ర్యక్రమంలో పాల్గొన్న వీడియోలను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది.