27-09-2025 08:43:58 AM
గట్లమల్యాల పీహెచ్సీ వైద్యాధికారి అంజలి రెడ్డి
నంగునూరు,(విజయక్రాంతి): మహిళల ఆరోగ్యం, సంక్షేమమే కేంద్ర రాత్ర ప్రభుత్వల ప్రధాన లక్ష్యమని గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Center) వైద్యాధికారి అంజలి రెడ్డి అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం గట్లమల్యాల పీహెచ్‌సీలో ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజలి రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం శక్తివంతంగా ఉంటుందని పేర్కొన్నారు.
మహిళలు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలకు సమగ్ర వైద్య పరీక్షలు, చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిబిరంలో 173 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో123 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు (ల్యాబ్ టెస్టులు) నిర్వహించామన్నారు. వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బందికి, గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం, పీహెచ్‌సీ సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రాజేందర్, కీర్తశ్రీ, సీహెచ్‌ఓ ఎల్లవ్వ, హెచ్‌ఈఓ కనకయ్య, పీపీహెచ్‌ఎన్ జయమ్మ, మహిళ హెచ్‌ఎస్‌లు పద్మ భాయ్, లిటిల్ ఫ్లవర్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.