27-09-2025 08:41:35 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bheem Asifabad District) బెజ్జూర్ మండల కేంద్రంలోని రేంజ్ అధికారి కార్యాలయం ముందు వరద నీరు చేరింది. మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువలు లేకపోవడంతో కురిసిన భారీ వర్షానికి వరద నీరు(Flood water) కార్యాలయం చుట్టూ చేరింది. కార్యాలయానికి వచ్చే అధికారులు, సిబ్బంది, ప్రజలు సైతం నీటిలో నడుచుకుంటూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిగా మారిందని తెలుపుతున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు.