09-05-2025 12:59:52 AM
ఎల్బీనగర్, మే 8 : ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన దారెడ్డి అభినవ్‌రెడ్డి యువజన కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమితుల య్యారు ఈ మేరకు గురువారం జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందినవారు కావడంతో ఇన్ చార్జి పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భం గా అభినవ్‌రెడ్డి మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభు త్వ కార్యక్రమాలను ప్రజలోకి తీసుకెళ్తానని తెలిపారు.
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు దయాసాగర్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జిలు రాంరెడ్డి, అరవింద్ తదితరులకు అభినవ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.