calender_icon.png 9 May, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

09-05-2025 12:58:45 AM

-జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం

ఖైరతాబాద్ మే 8 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం అన్నారు.

ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వకుం ట్ల తారక రామారావు మతిస్థిమితం కోల్పోయి ‘సీఎం రేవంత్‌రెడ్డిని నాలుక కోసేస్తాం, చేతకాకుంటే దిగిపో’ అని మాట్లాడుతున్నారన్నారు.

ప్రత్యేక తెలంగాణ నాటికి మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులోకి తీసుకెళ్ళింది కేసీఆర్ ప్రభు త్వం అని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, భూముల స్కాం, ఫోన్ ట్యా పింగ్, విద్యుత్ కొనుగోలులో అవినీతితో పాటు అన్ని శాఖలలో చేసిన అవినీతిపై దర్యాప్తు జరుగుతుందని దర్యాప్తు అనంతరం తాము ఎక్కడ అరెస్టు కావలసి వస్తుందోనన్న భయంతో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పుల్లో మూ డు లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. ఆ డబ్బుతో కేటీఆర్, కవిత విదేశాలలో పెట్టుబడులు పెట్టారన్నారు. వీటన్నిటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్తారని తెలిపారు.