16 August, 2026 | 4:34 AM

డార్క్ చాక్లెట్ అందరూ మాట్లాడుకునే చిత్రం

16-08-2026 12:00 AM

రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్’ చిత్రాన్ని అందిస్తున్నారు. ఇందులో విశ్వదేవ్ రాచకొండ,  బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించారు. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘కల్లో కల్లోలం’ పాటను ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. “కల్లో కల్లోలం’ పాట ఈ సినిమాలో ముఖ్యమైన సందర్భంలో వస్తుంది.

ఇది చాలా కొత్త తరహా సినిమా. ప్రేక్షకులు కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. తప్పకుండా ఈ సినిమా ఒక పెద్ద బ్యాంగర్ అవుతుంది” అన్నారు. బిందుమాధవి మాట్లాడుతూ.. “డార్క్ చాక్లెట్’లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశా. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు” అని చెప్పింది.

డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. “కల్లో కల్లోలం’ పాటలో ఈ సినిమా కథంతా నిక్షిప్తమై ఉంది. కాకపోతే అది అంత ఈజీగా పట్టుకోలేం. ఇది చాలా కొత్త రకం డార్క్ కామెడీ సినిమా” అని చెప్పారు. డైరెక్టర్ నందకిషోర్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, అనురాగ్ కులకర్ణి మూవీ యూనిట్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.