మస్తుగుందిరా యవ్వారం..
యంగ్ హీరో హవీష్ నటిస్తున్న చిత్రం ‘నేను రెడీ’. త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీశర్మ, శ్రీలక్ష్మి, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ కాగా, ఇప్పుడు మూడో సింగిల్ ‘మస్తుగుందిరా యవ్వారం’ ను విడుదల చేశారు మేకర్స్. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, అనురాగ్‌కులకర్ణి, మానసి ఎరబతినీ పాడారు. హవీష్, కావ్య థాపర్ మధ్య కుదిరిన కెమిస్ట్రీ, ఎనర్జీ ఈ పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ చిత్రానికి నిజార్ షఫీ డీవోపీని, ప్రవీణ్ పూడి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. త్వరలోనే విడుదల కానుందీ చిత్రం.






