17-01-2026 02:11:34 AM
వ్యవసాయ పోలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దు
జగదేవపూర్, జనవరి 16 : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామ శివారులోని వ్యవసాయ పోలాల వద్ద పులి సంచ రిస్తున్నట్లు ఆనవాళ్లు కనిపించడంతో ప్రజ లూ భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం కొంతమంది రైతులు ఉదయం తమ పోలాల వద్దకు వెళ్లుచుండగా గ్రామ శివారులోని పెద్ద గుండు ప్రాంతంలో పులి పాదాల అడుగులు కనిపించడంతో రైతులు గ్రామస్తులకు సమాచారం అందించారు.
గ్రామంలో ని ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి పులి తిరిగిన అడుగులను చూసి భయాందోళన గురయ్యారు. గ్రామస్తులు అందించిన సమాచారంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మల్లేశంతో పాటు సిబ్బంది బీట్ ఆఫీసర్ స్వామి క్షేత్రస్థాయిలో పర్యటించి పులి అడుగులను పరిశీలించారు. అనంతరం జిల్లా ఫారెస్ట్ అటవీశాఖ అధికారి పద్మజారాణి సంఘటన స్థలా నికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు.
అలాగే అంతాయిగూడ గ్రామము లో కూడా పాదముద్రలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పూర్తిస్థాయిలో పాదముద్రలు పరిశీలించి పులి లేదా చిరుతపులా అనేది నిర్ధారిస్తామని చెప్పారు. ఇటీవల జిల్లాలోని రాయపోల్, దౌల్తాబాద్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలిసిన విషయమే. అలాగే ఇటీవల కుకూనూరుపల్లి, తోగుట మండలంలో కూడా పులి సంచరించినట్లు తమ దృష్టికి వ చ్చిందని ఆ దిశగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందు లో భాగంగానే జగదేవపూర్ మండలంలో కూడా పాదముద్రలను చూస్తుంటే ఇక్కడ కూడా పులి సంచరిస్తుందని తెలుస్తుందని చెప్పారు. ఏదేమైనాప్పటికీ రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుం పులుగా వెళ్లాలని సూచించారు.
పశువులను కూడా వ్యవసాయ పొలాల్లో కట్టెయ్యకుండా పశువుల కొట్టంలో కట్టేసుకోవాలని సూచిం చారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని పిల్లలను ఒంటరిగా వదలకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే రైతులు సాగుచేసిన పంటల రక్షణ కోసం విద్యుత్ కంచెలు ఏర్పా టు చేస్తే వెంటనే తీసివేయాలని సూచించారు. గ్రామాల్లో పశువులపై దా డులు జరిగినట్లయితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో దండోరా వే యించాలని కోరారు.
పులి సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పట్టుకోవడానికి చర్య లు తీసుకుంటామని వివరించారు. కా ర్యక్రమంలో ఫారెస్ట్ శాఖ అధికారులు వినాయక్, షేకావత్, అర్జున్, స్వామి తీగుల్ గ్రా మ సర్పంచ్ రజిత పరశురాం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పరమేశ్వర్, రాంనగర్ రజిత మల్లేశం, మాజీ సర్పంచ్ లు సుధాకర్ రెడ్డి, భానుప్రకాష్ రావు పాల్గొన్నారు.