20-08-2025 01:26:35 AM
అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘ఏఏ22ఏ6’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టులో దీపికా పదుకొణె సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతోందనని ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెర దించే వార్త ఒకటి ఇప్పుడు బాలీవుడ్‌లో వినవస్తోంది. దీపికా అక్టోబర్‌లో షారుఖ్‌ఖాన్‌తో ‘కింగ్’ షూటింగ్‌లో పాల్గొన నుంది. తర్వాత అల్లు అర్జున్ మూవీ షూటింగ్‌కు హాజర వుతుంది.
నవంబర్ నుంచి మొద లై, 100 రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొననుంది. ఈ సినిమాలో దీపిక ఓ యోధురాలి పాత్రను పోషించనుందంటూ టీమ్ గతంలో ఆమె రిహార్సల్స్ చిత్రాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో దీపికా లుక్ విషయంలో టీమ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ప్రేక్షకులు తెరపై ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో దీపిక లుక్‌ను తీర్చిదిద్దుతున్నారట. దర్శకుడు అట్లీ ఈ సినిమాలో రెడ్ అండ్ బ్లూ అనే రెండు ప్రపంచాలను చూపించబోతున్నారని సమాచారం. సినిమాలో యాక్షన్, భావోద్వేగాలు, డ్రామా వంటి సన్నివేశాలు ఉంటాయట. 2026 సెప్టెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి, 2027 ద్వితీయార్ధంలో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు.