20-08-2025 01:25:15 AM
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీ కథతో దర్శకుడు మురళీమనోహర్ రూపొందిస్తున్నారు. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మాతలు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్న టీమ్ తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ పాటకు సురేశ్ గంగుల లిరిక్స్ అందించగా, లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ కంపోజ్ చేశారు.
‘ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి.. ఏరు దాటివేయ్.. ఓ రూటు వేయ్.. నింగినుంచి ఊడిపడ్డ వాడు ఎవ్వడు ఇక్కడ.. మంకీ నుంచి వచ్చిన వాళ్లే కదా అందరు ఇక్కడ.. నీరసించి నీరుగారి ఉండిపోకు ఎక్కడ..’ అంటూ ర్యాప్ స్టుటైల్లో సాగుతుందీ గీతం. బ్రహ్మానందం, యోగిబాబు, ప్రభాస్ శ్రీను, రాజ్‌కుమార్ కసిరెడ్డి, జీవన్‌కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కృష్ణ సౌరభ్; డీవోపీ: అర్జున్ రాజా.