18-10-2025 04:12:34 PM
చేవెళ్ల: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ చేవెళ్లలో విజయవంతం అయ్యింది. శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. బీసీ సంఘాలు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ పార్టీల నేతలు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య పాల్గొని బంద్ కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదింపజేయాలని కోరారు.