calender_icon.png 12 November, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి

12-11-2025 02:02:53 PM

తలాండి శ్రావణి కుటుంబానికి న్యాయం జరగాలి

డివైఎఫ్ఐ జిల్లా  అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గొడిసెల కార్తీక్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తలాండి శ్రావణి  కుటుంబానికి న్యాయం జరగాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపడుతున్న చేలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని  డివైఎఫ్ఐ జిల్లా  అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గొడిసెల కార్తీక్ కోరారు. బుధవారం  తిర్యాణి మండలంలోని భీంజీగూడ లో  కరపత్రాల విడుదల విడుదల చేశారు. కుల దురంకరణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హత్యకుగురి  అయినా శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని  దోషులను త్వరగా శిక్షించాలని,  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలి.

కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తో పాటు 25 లక్షల ఎక్స్గ్ గ్రెషన్ ఐదెకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 22న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.  గత నెల 18వ తేదీన జరిగిన కుల దురంకార హత్యపై ఇప్పటివరకు కలెక్టర్  స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ  కార్యక్రమంలో  ఆత్రం గంగు, టేకం మారతి ,ఆత్రం బాలు, కోరంగ తరక్, గెడం రమేష్,  తుమ్రా శ్యాం రావు, తదితరులు పాల్గొన్నారు.