calender_icon.png 7 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇమామ్ మౌజన్ ల వేతనాల పునరుద్ధరణకు గడువు పెంపు

06-08-2025 10:53:28 PM

మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని జులై 31 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు పొడగించడం జరిగిందని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా(Minority Welfare Association State General Secretary Md. Yakub Pasha) బుధవారం నాడు ఒక ప్రకటనలో  తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులలో సేవలందిస్తున్న ఇమాం, మౌజన్ లు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్ లోని హజ్ హౌస్ లో గల వక్ఫ్ బోర్డు కార్యాలయంలో లేదా జిల్లాలలోని కలెక్టరేట్ లలోని వక్ఫ్ కార్యాలయాలలో అందజేయాలని అన్నారు.