07-08-2025 04:47:57 PM
శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్..
అడిషనల్ డీసీపీ వెంకటరమణ..
హుజురాబాద్ (విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని అడిషనల్ డీసీపీ వెంకటరమణ(Additional DCP Venkataramana) సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ, గ్యాస్ గోదాం ఏరియాలో హుజురాబాద్ ఏసీపీ మాధవి(ACP Madhavi) ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధృవ పత్రాలు లేని 75 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రజలు మత్తు పదార్థాలపై సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయని, సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్దన్ సెర్చ్ ద్వారా శాంతి భద్రత పరిరక్షణకు తోడ్పడుతుందని పోలీసులకు ప్రజలకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి అన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో 6 గురు సి ఐ లు, 4 గురు ఎస్సైలతో సహా 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.